image



పాక్‌ ప్రధాన న్యాయమూర్తి అధికారాలను తగ్గించేందుకు బిల్లు




→పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) అధికారాలకు కత్తెర వేసేలా ఆ దేశ పార్లమెంటు కీలక బిల్లును ఆమోదించింది.
 
→సుమోటో కేసులు, రాజ్యాంగ సంబంధ ధర్మాసనాలపై నిర్ణయాలకు సంబంధించి సీజేకున్న సంపూర్ణ అధికారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘ది సుప్రీం కోర్టు (ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌) బిల్లు - 2023’ పార్లమెంటు ఆమోదం పొందింది.
 
→దీని ప్రకారం ఇకపై ఏదైనా అంశాన్ని సుమోటోగా స్వీకరించే విషయమై ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో సీజే ఒక సభ్యుడిగా ఉంటారు. ఇప్పటివరకూ ఈ అధికారం సీజే ఒక్కరికే ఉండేది.
 
→దీంతో పాటు రాజ్యాంగాన్ని వివరించాల్సిన అవసరమున్న కేసుల విచారణకు ధర్మాసనంలో అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలన్న నిబంధనను చేర్చారు. 
 



International