image



రోదసిలోకి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన నలుగురు వ్యోమగాములు




నలుగురు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 
 
వీరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన సల్తాన్‌ అల్‌ నెయాదీ కూడా ఉన్నారు. 
 
అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 
 
ఈ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు నిర్వర్తించనున్నారు.
 
 గత అక్టోబరు నుంచి అక్కడ పనిచేస్తున్న అమెరికా, రష్యా, జపాన్‌ వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు.
 
 ఎమిరేట్స్‌ తరఫున రోదసిలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా నెయాదీ గుర్తింపు పొందారు. 
 
 సౌదీ యువరాజు సుల్తాన్‌ బిన్‌ సల్మాన్‌ 1985లో డిస్కవరీ షటిల్‌లో ప్రయాణించి అంతరిక్ష యాత్ర చేసిన తొలి అరబ్‌గా ఖ్యాతిని ఆర్జించారు. 
 
 అయితే ఎక్కువ కాలం అంతరిక్షంలో బసచేసిన తొలి అరబ్‌వాసిగా నెయాదీ చరిత్ర సృష్టించనున్నారు. 
 
 ఆరు నెలల పాటు ఆయన ఐఎస్‌ఎస్‌లో ఉంటారు. ఈ యాత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన స్టీఫెన్‌ బోవెన్, వారెన్‌ హోబర్గ్, రష్యాకు చెందిన ఆండ్రెయ్‌ ఫెడయేవ్‌ పాలుపంచుకున్నారు. 
 
 ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఐఎస్‌ఎస్‌ విషయంలో అమెరికా, రష్యా కలిసే పని చేస్తున్నాయి.
 



International