image



మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్‌




→ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ (69) సరికొత్త చరిత్ర లిఖించారు. 
 
→మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు ఆయనకు అత్యున్నత అధికార బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంటు, నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
 
→గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) మహాసభ జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. 
 
→దీంతో సీపీసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు. 
 
→సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే యథాతథంగా అమలు చేస్తూ ‘రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంటుగా పేరొందిన ఎన్‌పీసీ జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మొత్తం 2,952 మంది సభ్యులు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. 
 
→ఈ ఎన్నిక తర్వాత జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. 
 
→జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 
 
→ ఇరవై లక్షల మందికి పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి అధిష్ఠానంగా భావించే కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ పార్లమెంటు తీర్మానించింది. 
 
→దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ చేతుల్లోకే వెళ్లాయి. 
 
→పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనాలోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అధినాయకుడిగా కొనసాగనున్నారు.
 



International