imageచైనా కొత్త ప్రధాని లీ చియాంగ్‌
 
→చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్‌ (63) ఆ దేశ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 
 
→గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్‌ (67) స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 
 
→అంతకుముందు చియాంగ్‌ పేరును అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిపాదించగా చైనా పార్లమెంటు, నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపింది. 
 
→మొత్తం పార్లమెంటు సభ్యులు 2,952 మంది కాగా సమావేశానికి 2,947 మంది హాజరయ్యారు. వీరిలో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 
 
→ముగ్గురు సభ్యులు చియాంగ్‌కు వ్యతిరేకంగా, మిగిలిన 2,936 మంది అనుకూలంగా ఓటు వేశారు. 
 
→ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత చియాంగ్‌ను ప్రధాన మంత్రిగా నియమిస్తున్నట్లు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
→తదనంతరం నూతన ప్రధాని దేశ రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. 
 International