image



చైనా రక్షణ బడ్జెట్‌ 225 బిలియన్‌ డాలర్లు




→చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా 7.2 శాతం పెంచింది. 
 
→ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు కాగా డాలర్లలో 225 బిలియన్లు. చైనా రక్షణ బడ్జెట్‌ను పెంచడం వరుసగా ఇది 8వసారి. 
 
→చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం. 
 
→గతేడాది 7.1 శాతం పెంపుతో 1.45 ట్రిలియన్ల (230 బిలియన్‌ డాలర్ల) బడ్జెట్‌ను ఆమోదించింది. 
 
→యువాన్‌తో పోలిస్తే డాలర్‌ విలువ ఈ ఏడాది పెరిగిన నేపథ్యంలో 225 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు చైనా అధికార పత్రిక విశ్లేషించింది. 
 
→ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 2023 సంవత్సరానికి 816 బిలియన్‌ డాలర్లు. ఆ తరువాత అత్యధిక బడ్జెట్‌ చైనాదే కావడం గమనార్హం. 
 
→భారత రక్షణ బడ్జెట్‌ (రూ.5.94 లక్షల కోట్లు/72.6 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే అది మూడు రెట్లు అధికం. 
 
→దేశ రబ్బర్‌ స్టాంపు పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి పదవి నుంచి దిగిపోతున్న ప్రధాని లి కెకియాంగ్‌ తన స్వీయ
నివేదిక సమర్పించారు. 
 
→అందులో సరిహద్దుల్లో (తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభనను నేరుగా పేర్కొనకుండా) సైనిక బలగాలు చూపిన ధైర్యసాహసాలను గొప్పగా వివరించారు.
 



International