image



తొలిసారిగా ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ!




→ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించే జీవజాలాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏకగ్రీవ ఒప్పందానికి వచ్చాయి. 
 
→ ఏ దేశానికీ చెందని ఈ సముద్ర జలాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని రక్షించడమంటే సగం భూగోళాన్ని కాపాడటమే అని ఈ మేరకు జరిగిన సమావేశం అభిప్రాయపడింది. 
 
→ ఈ ఒప్పందాన్ని తీసుకురావడానికి 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనప్పటికీ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. 
 
→ ఆఖరుకు గత రెండు వారాల నుంచి న్యూయార్క్‌లో జరుగుతున్న సమావేశాల్లో ఒప్పందానికి సభ్యులందరూ ఆమోదముద్ర వేశారు. 
 
→ ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రత్యేక సముద్ర జీవవైవిధ్య ప్రాంతాలు ఏర్పాటవుతాయి. 
 
→ వీటిని సమన్వయం చేయడానికి నూతన అంతర్జాతీయ ప్రాధికార సంస్థ ఉనికిలోకి వస్తుంది. 
 
→ మహా సముద్రాల్లో నిర్వహించే వాణిజ్య కార్యకలాపాలు పర్యావరణపరంగా చూపించే ప్రభావానికి సంబంధించి కూడా ఈ ఒప్పందం నియమ నిబంధనలను రూపొందిస్తుంది. 
 
→ సముద్రం అపరిమితమైన వనరు కాదని గుర్తించడం, సముద్ర జలాలను సుస్థిరంగా ఉపయోగించుకోడానికి ప్రపంచ దేశాల సహకారం అవసరమని చాటడం కొత్త ఒప్పంద ఉద్దేశమని న్యూజెర్సీ విశ్వవిద్యాలయ జీవ శాస్త్రవేత్త మాలిన్‌ పిన్‌స్కీ తెలిపారు. 
 



International