image



‘ఫోర్స్‌’ ఉపాధ్యక్షుడిగా వినయేంద్ర పర్వతనేని




→ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఫ్రైట్‌ ఫార్వాడర్స్‌ సంఘమైన ఫోర్స్‌ (ఫ్రైట్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రిలేటెడ్‌ కార్గో ఎక్స్‌పర్ట్స్‌) ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన వినయేంద్ర పర్వతనేని (35) ఎన్నికయ్యారు.
 
→ సీవేస్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ (సీవేస్‌ గ్రూపు) అనుబంధ కంపెనీల్లో వినయేంద్ర పర్వతనేని డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
→ ఫోర్స్‌కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు ఈయనే. ఫోర్స్‌కు ఒక్కో దేశం నుంచి ఒక కంపెనీ మాత్రమే ప్రతినిధిగా ఉంటుంది. 
 
→ ఐరోపా, అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన ఆరుగురు ఫ్రైట్‌ ఫార్వాడర్స్‌తో 1982లో ‘ఫోర్స్‌’ ఏర్పాటైంది. 
 
→ ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి భారత్‌ నుంచి రెండు దశాబ్దాలుగా సీవేస్‌ గ్రూపు ప్రాతినిధ్యం వహిస్తోంది. 
 
→ సీవేస్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన కెప్టెన్‌ పీవీకే మోహన్, ఇంతకు ముందు ఫోర్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
→ వినయేంద్ర పర్వతనేని, యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ చేశారు. 
 
→ ఆ తర్వాత యూఎస్‌లోని థండర్‌బర్డ్‌ యూనివర్సిటీ-ఫోనిక్స్‌ (అరిజోనా) నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. 
 
→ ఫోర్స్‌ నూతన కార్యవర్గాన్ని మార్చి 6న దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.
 



International