image



2022లో హక్కుల ఉల్లంఘన ఎక్కువే




→చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా కొందరిని మట్టుబెట్టడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, అల్ప సంఖ్యాక వర్గాల వారిపై హింస పరంగా 2022లో భారత్‌లో పెద్దఎత్తున హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందని అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది. 
 
→ఈ మేరకు ‘వార్షిక మానవ హక్కుల నివేదిక’ను విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విడుదల చేశారు. 
 
→భారత్‌లో ఏ స్థాయిలోనూ అధికార దుర్వినియోగానికి జవాబుదారీతనం లేదు. 
 
→అలసత్వం, సుశిక్షితులైన పోలీసు అధికారుల కొరత, తగినన్ని వనరులు లేక సతమతమవుతున్న న్యాయ వ్యవస్థ వల్ల తక్కువ మందికే శిక్షలు పడుతున్నాయి. 
 
→చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు కొందరిని హతమారుస్తుండడం, జైళ్లలో చిత్రహింసలు పెట్టడం, అమానవీయంగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. 
 
→జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఏకపక్షంగా కొందరిని నిర్బంధిస్తున్నారు. గోప్యతలో చొరబడుతున్నారు. 
 
→పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తున్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. పాత్రికేయుల్ని ప్రాసిక్యూట్‌ చేస్తున్నారు. 
 
→ఇంటర్నెట్‌ స్వేచ్ఛపైనా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. 
 
→వివిధ దేశాల్లో హక్కుల ఉల్లంఘనల గురించి దీనిలో పొందుపరిచారు. ముఖ్యంగా రష్యా, చైనాల్లో భారీగా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. 
 
→ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్‌ వంటి ఇతర దేశాల్లోని పరిస్థితులనూ ప్రస్తావించారు.
 
→ చైనాలోని జిన్‌జియాంగ్‌లో ముస్లిం యూగర్లు, ఇతర అల్పసంఖ్యాక వర్గాల వారిపై దమనకాండ సాగిందని పేర్కొన్నారు.
 



International