image



నాటోలోకి ఫిన్లాండ్‌




→ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం ఫిన్లాండ్‌ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. 
 
→ఇందుకు సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు అందజేశారు. 
 
→అంతకు ముందు ఫిన్లాండ్‌ చేరికను బ్లింకెన్‌ ప్రకటించారు. నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంటుంది. 
 
→నాటోలో ఫిన్లాండ్‌ చేరేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది. 
 
→ఇక నాటోలో చేరిక కోసం స్వీడన్‌ చేసిన దరఖాస్తు ఇంకా  పెండింగులో ఉంది. 
 
→దీనికి రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. 
 
→ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది. 
 
→ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌తో తమకు ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేవని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు.
 



International