image



ఫ్రాన్స్‌లో పదవీ విరమణ వయసు పెంపునకు ‘మండలి’ అమోదం




→ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న వివాదాస్పద పెన్షన్‌ బిల్లుకు ఇక్కడి రాజ్యాంగ మండలి ఆమోదం తెలిపింది.
 
→ దీంతో దేశంలో పదవీ విరమణ వయసును 62 నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు మార్గం సుగమమైంది. 
 
→ ఇది అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌కు ఊరటనిచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా ఫ్రాన్స్‌లో భారీగా ఆందోళనలు జరిగాయి. 
 
→ అవి మెక్రాన్‌ ప్రతిష్టను దిగజార్చాయి. రాజ్యాంగ మండలి తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు తమ ఆందోళనలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. 
 
→ పెన్షన్‌ బిల్లులోని కొన్ని ప్రతిపాదనలను రాజ్యాంగ మండలి తిరస్కరించింది. 
 
→ అయితే ప్రధానాంశమైన పదవీ విరమణ వయసు పెంపునకు ఆమోదం లభించింది. 
 
→ ఈ బిల్లును మెక్రాన్‌ 15 రోజుల్లోగా చట్టంగా మార్చొచ్చు.
 



International