image



చైనా గగనతల రక్షణ పరీక్ష విజయవంతం




→శత్రు క్షిపణులను మార్గమధ్యంలో నేలకూల్చే అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. 
 
→ఆ ఆయుధాన్ని నేలమీద నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. 
 
→దీంతో అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అస్త్రాలను ధ్వంసం చేసే సామర్థ్యం విషయంలో డ్రాగన్‌ పురోగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. 
 
→తమ భూభాగంలోనే ఈ పరీక్షను నిర్వహించామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పూర్తిగా ఆత్మరక్షణకు ఉద్దేశించిన ప్రయోగమని తెలిపింది. 
 
→ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని దీన్ని నిర్వహించలేదని వివరించింది. 
 
→సాధారణంగా ఇలాంటి వ్యవస్థల్లో నేల మీద నుంచి ప్రయోగించే క్షిపణులు, రాడార్లు, నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. 
 
→ఇవి అణు లేదా ఇతర వార్‌హెడ్‌లు కలిగిన ఖండాంతర క్షిపణులను మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. 
 
→అమెరికాలో ఈ తరహా వ్యవస్థను గ్రౌండ్‌ బేస్డ్‌ మిడ్‌ కోర్స్‌ డిఫెన్స్‌ (జీఎండీ)గా పిలుస్తారు. 
 
→ఇది చాలా సంక్లిష్ట వ్యవస్థ. దీన్ని నిర్మించడం, పరీక్షించడం, నిర్వహించడం చాలా కష్టం, వ్యయభరితం.
 



International