image



కక్ష్యలోకి కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం




→కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం తైఫా-1ను విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. 

→అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. 
 
→వాతావరణం సరిగా లేకపోవడం వల్ల రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదాపడింది. తైఫా-1 నాలుగు రోజులకోసారి కెన్యాకు ఎగువన పరిభ్రమిస్తుంది. 
 
→వ్యవసాయం, నేల, పర్యావరణానికి సంబంధించిన డేటాను సేకరిస్తుంది. 
 
→ఆ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా, ప్రైవేటు కంపెనీలకు తక్కువ ధరకు అందించనున్నట్లు కెన్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.
 



International