image



స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం




→స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్‌ ప్రయోగ పరీక్ష విఫలమైంది. 
 
→అమెరికాలో గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్‌ కేవలం 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో కూలిపోయింది. 
 
→స్టార్‌షిప్‌ పొడవు 120 మీటర్లు. ఇందులో 33 ఇంజిన్లు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాకెట్‌గా ఇది పేరుగాంచింది. 
 
→తొలి ప్రయోగ పరీక్షలో భాగంగా ఈ రాకెట్‌ దక్షిణ టెక్సాస్‌లోని బొకా చికా తీరం నుంచి నింగిలోకి ఎగిరింది. 
 
→భూ ఉపరితలం నుంచి 39 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అప్పటికే దానిలోని పలు ఇంజిన్లు పనిచేయడం మానేశాయి. 
 
→వ్యోమనౌక నుంచి బూస్టర్‌ విడిపోవాల్సి ఉన్నా అది కూడా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జరగలేదు. కొద్దిసేపటికే రాకెట్‌ కూలిపోయింది. 
 
→చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్టార్‌షిప్‌ను స్పేస్‌ఎక్స్‌ రూపొందించింది. 
 
→ప్రయోగ పరీక్ష మాత్రమే కావడంతో ఈ రాకెట్‌లో ఉపగ్రహాలను ఉంచలేదు. 
 
→భూమి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేసేలా దాని వ్యోమనౌకను సిద్ధం చేశారు.
 



International