image



గర్భస్థ పిండానికి తొలిసారిగా బ్రెయిన్‌ సర్జరీ




 
 
→ఇంకా గర్భంలోనే ఉన్న ఓ పిండం మెదడుకు అమెరికా వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. 
 
→ఈ తరహా ఆపరేషన్‌ చేయడం ప్రపంచంలో ఇది మొదటిసారి. 
 
→బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్, బ్రిఘాం అండ్‌ ఉమెన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు ఈ ఘనత సాధించారు. 
 
→ఈ చిన్నారి మెదడులో ‘వెయిన్‌ ఆఫ్‌ గాలెన్‌ మాల్‌ఫార్మేషన్‌’ అనే అరుదైన రుగ్మత తలెత్తింది. 
 
→ఈ సమస్య వల్ల మెదడులోని ధమనులు, అక్కడి ప్రధాన సిరతో అనుసంధానమవుతాయి. 
 
→ఫలితంగా ఆ సిర విస్తరించి, దాని గుండా ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. 
 
→దీనివల్ల ఆ చిన్నారి గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరిగా అందదు. 
 
→జన్మించిన కొద్ది రోజులకే ఈ శిశువుల్లో గుండె వైఫల్యం తలెత్తవచ్చు. పక్షవాతం లాంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు. 
 
→తల్లి గర్భంలో 30 వారాల వయసున్నప్పుడు ఈ సమస్యను ఆ చిన్నారిలో వైద్యులు గుర్తించారు.
 
→ ప్రధాన సిర వెడల్పు 14 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేల్చారని బోస్టన్‌ ఆసుపత్రి వైద్యుడు డారెన్‌ ఓర్బాక్‌ పేర్కొన్నారు.
 



International