image



బైడెన్‌ స్వదేశీ విధాన సలహాదారుగా నీరా టండన్‌ నియామకం




→అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సలహామండలిలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు దక్కింది. బైడెన్‌ స్వదేశీ విధాన సలహాదారుగా 52 ఏళ్ల నీరా టండన్‌ నియమితులయ్యారు. 
 
→స్వదేశీ విధానం, ఆర్థిక, రక్షణ విధానాల రూపకల్పనలో అధ్యక్షుడికి మూడు ఉన్నత మండళ్లు సాయపడతాయి. 
 
→అందులో ఒక దానికి భారతీయ అమెరికన్‌ సారథ్యం వహించడం ఇదే ప్రథమం. 
 
→2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్వదేశీ విధాన రూపకల్పనకు నీరాను నియమించడం కీలక పరిణామం. 
 
→ఆర్థికాభివృద్ధి, జాతుల మధ్య సమానత్వం, ప్రజారోగ్యం, విద్య, వలస వ్యవహారాలపై ఆమె తనకు సహకరిస్తారని బైడెన్‌ ప్రకటించారు. 
 
→నీరా ముగ్గురు దేశాధ్యక్షుల (ఒబామా, బిల్‌ క్లింటన్, బైడెన్‌) నాయకత్వంలో పనిచేశారని గుర్తుచేశారు.
 



International