image



12 ఏళ్ల తర్వాత మళ్లీ అరబ్‌ లీగ్‌లోకి సిరియా




→అరబ్‌ లీగ్‌లోకి సిరియా అధికారికంగా ప్రవేశించింది. లీగ్‌ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
→2011లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచివేయడం, అంతర్యుద్ధానికి దారి తీసింది. 
 
→ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం రద్దైంది. 
 
→మళ్లీ సిరియాను కూటమిలోకి తీసుకోవడానికి జరిగిన సమావేశానికి ఖతార్‌ సహా కొన్ని దేశాలు గైర్హాజరవ్వడం గమనార్హం.
 



International