image



మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌ వద్ద జరిగిన సైనిక కవాతు




→ప్రస్తుతం ప్రపంచం కీలక మలుపులో ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. 
 
→విక్టరీ డే సందర్భంగా మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌ వద్ద జరిగిన సైనిక కవాతులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
→రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయోత్సవాన్ని రష్యా ఘనంగా నిర్వహిస్తుంది. 
 
→పాశ్చాత్య దేశాల నుంచి ముప్పును ఎదుర్కొనేందుకే ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందని పలుమార్లు స్పష్టం చేసిన పుతిన్‌ ఇప్పుడు మరోసారి ఆ దేశాలను తప్పుపట్టారు. 
 
→ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
 



International