image



కుల వివక్షను నిషేధించే బిల్లుకు కాలిఫోర్నియా సెనెట్‌ ఆమోదం




→కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్‌ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. 
 
→అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియానే కావడం గమనార్హం. 
 
→అఫ్గానిస్థాన్‌ సంతతికి చెందిన సెనేటర్‌ అయిషా వాహబ్‌ గత నెలలో ఈ బిల్లును (ఎస్‌బీ403) ప్రవేశపెట్టారు. 
 
→34-1 ఓట్ల తేడాతో దానికి ఆమోద ముద్ర లభించింది. 
 
→ఇది గవర్నర్‌ ఆమోదం పొంది చట్ట రూపం దాల్చే ముందు ఇదే తరహా బిల్లును రాష్ట్ర ప్రతినిధుల సభలోనూ ప్రవేశపెడతారు. 
 
→కుల వివక్షకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వర్గాలకు ఈ చట్టం రక్షణనిస్తుంది. 
 
→సియాటిల్‌ నగరంలో కూడా కుల వివక్షను నిషేధిస్తూ ఈ ఏడాదే తీర్మానం ఆమోదించిన సంగతి గమనార్హం.
 



International