image



అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభల్లో బాలల బిల్లు




→వృత్తి ఉద్యోగాలపై అమెరికాకు వచ్చిన వారి సంతానానికి 21 ఏళ్ల వయసు రాగానే ఆ పిల్లలు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనే నిబంధనను తొలగించడానికి పాలక, ప్రతిపక్ష సభ్యులు అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభల్లో బాలల బిల్లును ప్రవేశపెట్టారు. 
 
→హెచ్‌ 1బి, ఎల్‌ 1, ఈ1, ఈ2 వీసాలపై అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల పిల్లలు 2,50,000 మంది వరకు ఉంటారు. 
 
→వారిలో అత్యధికులు భారతీయ అమెరికన్లే. తల్లిదండ్రులు శాశ్వత పౌరసత్వమిచ్చే గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తుంటే, అది వచ్చే లోపు వారి పిల్లలకు 21 ఏళ్లు దాటిపోవచ్చు. 
 
→ఆ సమయం రాగానే పిల్లలు వారివారి దేశాలకు తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది. దీన్ని సరిదిద్దడానికి అమెరికా కాంగ్రెస్‌లో బాలల బిల్లును ప్రతిపాదించారు. 
 
→ఉపాధి వీసాలపై వచ్చిన తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలూ అమెరికాకు వచ్చి మొత్తం పదేళ్ల పాటు ఇక్కడ నివసించి, ఉన్నత విద్యా కోర్సులో పట్టభద్రులైతే వారికి శాశ్వత నివాస హక్కు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 
 



International