image



ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన




→ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి విశేష ఆదరణ లభిస్తోంది. 
 
→చిరకాలంగా కొనసాగుతున్న రెండు దేశాల మైత్రీ బంధాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న అభిలాషను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. 
 
→బ్రిస్బేన్‌ నగరంలో భారతీయ కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 
 
→ప్రపంచంలోనే అతిపెద్ద యువ ప్రతిభావంతుల కర్మాగారం (టాలెంట్‌ ఫ్యాక్టరీ) భారత్‌ అని పేర్కొన్నారు. 
 
→ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలోని కుదోస్‌ బ్యాంక్‌ అరెనాలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. 
 
→భారత్, ఆస్ట్రేలియాల వ్యూహాత్మక భాగస్వామ్యం రోజు రోజుకీ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. 
 
→వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికన్నా రెండింతలకు పైగా వృద్ధిచెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
→గత ఏడాది కుదిరిన ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ఇందుకు దోహదపడనుందని తెలిపారు.
 
→ఇరు దేశాల బంధాన్ని దృఢతరం చేస్తున్న పలు అంశాలను ప్రధాని మోదీ విశ్లేషణాత్మకంగా వివరించారు. 
 
→‘3సీ’లు (కామన్వెల్త్, క్రికెట్, కర్రీ); ‘3డీ’లు (డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ); ‘3ఈ’లు (ఎనర్జీ, ఎకనామీ, ఎడ్యుకేషన్‌) రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని కొన్ని తరాలుగా అనుసంధానిస్తున్నాయని తెలిపారు. 
 
→ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, యోగా తదితరాలు మన బంధం మరింత బలోపేతం కావడానికి ఉపకరిస్తున్నాయన్నారు. 
 
→వాస్తవానికి వీటన్నింటి కన్నా ఆస్ట్రేలియాతో భారత్‌ బంధం దృఢతరమవడానికి కారణం పరస్పర నమ్మకం, గౌరవం, ఇక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులని మోదీ వెల్లడించారు. 
 



International