image



టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్‌ నిషేధం




→మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్‌ నిషేధం విధించింది. 
 
→ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్‌ - బ్రిటిష్‌ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది. 
 
→ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లింట్లాక్‌ స్పోర్టింగ్‌ గన్‌ అని పిలిచే ఈ తుపాకీ 1793 - 94 కాలానికి చెందినది. 
 
→ఈ సింగిల్‌ బ్యారెల్‌ తుపాకీ నుంచి రీలోడింగ్‌ చేయకుండానే ఒకేసారి సారి రెండు తూటాలు వెలువడతాయి. 
 
→తయారు చేసిన అసద్‌ ఖాన్‌ మహ్మద్‌ సంతకం కూడా దీనిపై ఉంది. 
 
→ఇది అప్పటి జనరల్‌ కార్న్‌వాలిస్‌కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
→టిప్పు సుల్తాన్‌కు చెందిన ఓ కత్తికి ఇటీవల వేలంలో రూ.144 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే.
 



International