image



జల్‌ జీవన్‌ మిషన్‌తో 4 లక్షల మరణాలను అడ్డుకోవచ్చు




→అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగు నీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌ జీవన్‌ పథకం పూర్తయితే అతిసారం వల్ల కలిగే 4 లక్షల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కగట్టింది. 
 
→ఇంతవరకు 62% గ్రామీణ కుటుంబాలకు కొళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 
 
→భారత్‌లో 100 శాతం పల్లె కుటుంబాలకు మంచి నీరు అందిస్తే పారిశుద్ధ్యానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. 
 
→అతిసార మరణాలను జల్‌ జీవన్‌ మిషన్‌తో నివారించడం ద్వారా 10,100 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని తెలిపింది.
 



International