image



రుణ పరిమితి పెంపు చట్టంపై బైడెన్‌ సంతకం




→అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. 
 
→ఫలితంగా నగదు కొరత అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందని అంతకుముందు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది. 
 
→2021 నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ. 
 
→ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించిందే. దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. 
 
→ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. 
 
→ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరింది. 
 
→ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు రుణ పరిమితి పెంచేందుకు తొలుత ససేమిరా అన్నారు. 
 
→దీంతో గత కొంతకాలంగా కాస్త ఆందోళన నెలకొంది. అనంతరం వీరంతా ఓ ఒప్పందానికి వచ్చి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. 
 
→ఫలితంగా 314-117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 165-46 ఓట్ల తేడాతో డెమోక్రాట్‌లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు మద్దతు ఇచ్చారు.
 



International