image



హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్‌




→ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఆ అస్త్రాన్ని ఆవిష్కరించింది. ఈ క్షిపణికి ‘ఫత్తా’ అని పేరు పెట్టారు. 
 
→తాజాగా దీని నమూనాను ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌లోని ఏరోస్పేస్‌ విభాగం అధిపతి జనరల్‌ అమిర్‌ అలీ హాజీజాదే ఆవిష్కరించారు. 
 
→ఈ క్షిపణి 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని వివరించారు. దీన్ని నేలకూల్చగల అస్త్రమేదీ లేదన్నారు. 
 
→దీని ద్వారా శత్రువుల దూకుడుకు కళ్లెం వేసే శక్తిని సాధించామని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
 
→ఫత్తాలో కదిలే నాజిల్‌ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల అది మార్గమధ్యంలో తన గమనాన్ని మార్చుకోగలదని వివరించారు.
 



International