image



హైటెక్‌ రంగాల్లో భాగస్వామ్యానికి మార్గసూచీ




→హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు ఒక మార్గసూచీని ఆవిష్కరించాయి. 
 
→జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 
 
→దీని కింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలి కమ్యూనికేషన్, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటాయి. 
 
→రక్షణ, హైటెక్, వాణిజ్యం, విద్యార్థుల పరస్పర పర్యటనలు వంటి అంశాల్లో అవరోధాలను తొలగించడం వీటి ఉద్దేశమని చెప్పారు. 
 
→‘ఇనీషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌’ (ఐసెట్‌)పై సీఐఐ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ మార్గసూచీని డోభాల్, జేక్‌లు ఆవిష్కరించారు. 
 
→వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు ఐసెట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీలు గత ఏడాది మే నెలలో ప్రకటించారు. 
 
→ఇది కీలక అంశాల్లో మైత్రిని మరింత ముందుకు తీసుకెళుతుందని డోభాల్‌ తాజాగా పేర్కొన్నారు.
 



International