→ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లలో ప్రాణ త్యాగం చేసిన శాంతి పరిరక్షకుల జ్ఞాపకార్థం సంస్థ ప్రధాన కార్యాలయంలో స్మారక కుడ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.
→ఈ మేరకు భారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఐరాస సర్వ ప్రతినిధి సభ ఏకాభిప్రాయంతో ఆమోద ముద్ర వేసింది.
→రికార్డు స్థాయిలో 190 దేశాలు దాన్ని సమర్థించాయి.
→జూన్ 21న ఐరాస వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
→అమరులైన శాంతి పరిరక్షకులకు నివాళిగా కుడ్యాన్ని నిర్మించాలని ఆయన ఐరాసలో ఓ సదస్సు సందర్భంగా 2015లోనే ప్రతిపాదించారు.
International