image



లైంగిక అంశాల్లో సమ్మతి వయసును 16కు పెంచిన జపాన్‌




 
 
→అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాలకు జపాన్‌ కీలక మార్పులు చేసింది. 
 
→ఇందులో భాగంగా లైంగిక సంబంధిత అంశాల్లో సమ్మతి వయసును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచింది. 
 
→ఇప్పటి వరకు ఉన్న 13 ఏళ్ల వయసు ప్రపంచంలోనే అతి తక్కువ కావడం గమనార్హం. 
 
→ఇందుకు సంబంధించిన బిల్లుకు అక్కడి చట్టసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 
 
→దీంతో పాటు అత్యాచార కేసుల విచారణ, ఇతరుల లైంగిక చర్యలను వీక్షించడం వంటి వాటిపైనా తాజా బిల్లు స్పష్టతనిచ్చింది. 
 
→లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీస వయసు ఆయా దేశాల్లో భిన్నంగా ఉంది. 
 
→బ్రిటన్‌లో 16 ఏళ్లుగా ఉండగా, ఫ్రాన్స్‌లో 15 ఏళ్లు, జర్మనీ, చైనా దేశాల్లో 14 ఏళ్లుగా ఉంది. 
 
→వీరి కంటే తక్కువ వయసు వారితో పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అది అత్యాచారం కిందికే వస్తుంది. 
 
→లైంగిక ప్రయోజనాల కోసం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి డబ్బు ఆశచూపి బలవంతపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా జైలు శిక్ష తప్పదు. 
 
→అయితే, జపాన్‌లో ఇప్పటి వరకు ఇందుకు కనీస వయసు 13 ఏళ్లుగా ఉంది. 
 
→వీటికి సంబంధించిన నిబంధనల్లో 1907 నుంచి జపాన్‌ మార్పులు చేయకపోవడం గమనార్హం. 
 
→అత్యాచార నేరాలకు సంబంధించి 2017లో పలు చట్టాలకు జపాన్‌ కొన్ని మార్పులు చేసింది. 
 
→అయితే, నేర నియంత్రణకు అవి సరిపోవని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. 
 
→ఇదే సమయంలో అత్యాచార కేసుల్లో విచారణ ఎదుర్కొని నిర్దోషులుగా బయటపడిన వందల మంది ర్యాలీలు చేపట్టారు. 
 
→వీరిని వ్యతిరేకిస్తూ లైంగిక దాడులకు గురైన ఎంతో మంది బాధితులు, వారి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం సంచలనం రేపింది. 
 
→ఇలా అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తేవాలనే డిమాండ్‌ ఎక్కువ కావడంతో జపాన్‌ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువచ్చింది.
 
→ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని అక్కడి మానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి.
 



International