image



అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్య రక్షణకు ఐరాస ఒప్పందం




 
→అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు తొలిసారిగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 
 
→ఒప్పందానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని సింగపూర్‌ రాయబారి రెనా లీ ప్రకటించగానే 193 దేశాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. 
 
→భూమి మీద దాదాపు సగం ఉపరితలం అంతర్జాతీయ జలాల కిందికి వస్తుంది. 
 
→ప్రపంచ దేశాలు సంతకాలు చేయడానికి సెప్టెంబరు 20న జరిగే ఐరాస సర్వప్రతినిధి సభలో ఈ కొత్త ఒప్పందం అందుబాటులో ఉంటుంది. 
 
→కనీసం 60 దేశాలు ఆమోదించిన తర్వాత ఒప్పందం అమల్లోకి వస్తుంది. 
 
→సముద్ర జీవుల పరిరక్షణను పర్యవేక్షించడానికి అప్పుడొక కొత్త విభాగం ఏర్పాటవుతుంది. 
 
→అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు నిబంధనల రూపకల్పన వంటివి ఈ విభాగం చూస్తుంది.
 



International