image



వలసలతోనే అమెరికా జనాభా పెరుగుదల




→వలసల్లేకపోతే అమెరికాలో గత ఏడాది జనాభా తగ్గిపోయి ఉండేదని అమెరికా జన గణన సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 
 
→వలసల వల్లే అమెరికాలో శ్వేత జాతీయులు, ఆసియన్ల సంఖ్య పెరిగింది. 2022 మధ్య నాటికి అమెరికా జనాభా 33.32 కోట్లకు చేరుకుంది. 
 
→2021తో పోలిస్తే 0.4 శాతం ఎక్కువ. ఇతర దేశాల నుంచి శ్వేత జాతీయులు అమెరికాకు వలసవచ్చి ఉండకపోతే వారి జనాభా 85,000 వరకూ తగ్గిపోయి ఉండేది. 
 
→వలసల వల్ల వారి జనాభా 3,88,000 పెరిగింది. హిస్పానిక్‌ జాతి వారిని కలపకపోతే తెల్లవారి జనాభా 6,68,000 తగ్గిపోయేది. 
 
→గత ఏడాది నాటికి అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల సంఖ్య 26 కోట్ల పైచిలుకు ఉంది. 
 
→వారిలో 6.33 కోట్ల మంది తాము హిస్పానిక్‌ జాతివారమని చెబుతారు. 2021తో పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. 
 
→గత ఏడాది అమెరికా జనాభాలో 2.46 కోట్ల మంది ఆసియా సంతతి వారని తేలింది. 
 
→భారత్, చైనా తదితర ఆసియా దేశాల నుంచి వలసల వల్ల వీరి సంఖ్య 2.4 శాతం పెరిగింది. మరే ఇతర జాతిలోనూ ఇంతటి వృద్ధి కనిపించలేదు. 
 
→ప్రధానంగా జననాలు ఎక్కువ కావడం వల్ల నల్లజాతి వారి జనాభా 0.9 శాతం పెరిగింది. 
 
→అమెరికాలో 5 కోట్ల మంది నల్లజాతి వారున్నారని జనగణన తెలిపింది. 
 
→నిరుడు అమెరికన్‌ ఇండియన్, అలాస్కా గిరిజనుల జనాభా 72 లక్షలు. ఇది 1.3 శాతం పెరుగుదల. 
 
→హవాయి పసిఫిక్‌ ద్వీప వాసుల సంఖ్య 17 లక్షలు. ఇది 2021 కన్నా 1.2 శాతం పెరుగుదల.
 



International