→మయన్మార్‌లో ఎమర్జెన్సీని సైనిక ప్రభుత్వం పొడిగించింది.
→రాజధాని నేపిడాలో సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీవీ ఛానల్ వెల్లడించింది.
→పేరుకే ఎన్‌డీఎస్‌సీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా అధికారమంతా సైన్యం చేతిలోనే ఉంటుంది.
→సైన్యం ఆదేశాల మేరకే ఎమర్జెన్సీని పొడిగించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధం కాకపోవడంతో పాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందనే సైన్యం ఇలా ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది.
→ఆగస్టు 1 నుంచి 6 నెలల పాలు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది.
International