image



20 ఏళ్లలో తొలిసారి సింగపూర్‌లో మహిళకు ఉరిశిక్ష అమలు




→మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ మహిళను సింగపూర్‌ ఉరి తీసింది. 
 
→స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
→ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేసింది. 
 
→‘సారిదేవి దామని (45)కి విధించిన ఉరిశిక్ష అమలైంది’ అని సెంట్రల్‌ నార్కోటిక్స్‌ బ్యూరో తెలిపింది. 
 
→30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరి శిక్ష విధించారు.
 



International