image



నైగర్‌లో సైన్యం తిరుగుబాటు




→పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం ప్రకటించింది.
 
→ ఇప్పటికే అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్‌ గార్డు సభ్యులు చుట్టుముట్టారు. బజౌమ్, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
→ అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది. 
 
→ ఈ తిరుగుబాటును కర్నల్‌ మేజర్‌ అమదౌ బద్రామనె ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్‌లో ప్రకటించారు. 
 
→ తిరుగుబాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సైన్యం ఈ సందర్భంగా వెల్లడించింది.
 
→ దేశ సరిహద్దులను కూడా మూసివేసినట్లు తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించింది.
 



International