image



చైనా విదేశాంగశాఖ మంత్రిగా వాంగ్‌ యీ




→గత నెల రోజులుగా కనిపించకుండా పోయిన తమ విదేశాంగశాఖ మంత్రి చిన్‌గాంగ్‌ని తొలగిస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
→ఆయన స్థానంలో తిరిగి వాంగ్‌ యీని నియమించింది. ఈ నిర్ణయానికి అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. 
 
→చిన్‌గాంగ్‌ కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 
 
→చిన్‌గాంగ్‌ కంటే ముందు ఈ పదవిలో వాంగ్‌ యీ ఉండేవారు. 2013 నుంచి 2022 వరకు ఆ మంత్రిత్వ శాఖను ఆయనే నిర్వహించారు. 
 
→మంత్రిత్వ శాఖ నుంచి తప్పించేటప్పుడు అంతకంటే పెద్దదైన ‘చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ విదేశీ వ్యవహారాల కమిషన్‌’కు డైరెక్టర్‌గా ఆయన్ని నియమించారు. సీపీసీలో స్టేట్‌ కౌన్సిలర్‌ పదవినీ ఆయనకే ఇచ్చారు.
 



International