image



వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్‌ ఆమోదం




→రాజకీయ అధికారాన్ని న్యాయ వ్యవస్థ నియంత్రించకుండా అడ్డుకునే వివాదాస్పద బిల్లును ప్రజలు, ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయెల్‌ పార్లమెంటు కనెస్సెట్‌ ఆమోదించింది. 
 
→బిల్లుపై తుది ఓటింగ్‌ను ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేయడంతో బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో 64-0 ఓట్లతో ఆమోదింపజేసుకుంది. 
 
→బిల్లుపై జులై 23 నుంచి ఏకధాటిగా 30 గంటలసేపు చర్చ జరుగుతుండగానే పార్లమెంటు ఎదుట 20,000 మంది ప్రజలు గుమికూడి నిరసన తెలిపారు. 
 
→ప్రధాని నెతన్యాహు మోసం, లంచం, నమ్మకద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 
 
→రాజకీయ నాయకులు తీసుకునే ‘సమంజసమైన’ నిర్ణయాలను న్యాయ వ్యవస్థ తనిఖీ చేయకుండా నివారించే తాజా బిల్లును ఆయన పార్లమెంటుతో ఆమోదింపజేసుకున్నారు.
 



International