image



ధాన్యం ఒప్పందం నుంచి వైదొలగిన రష్యా




→రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 
 
→క్రిమియా ద్వీపాన్ని, రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే కీలక కెర్చ్‌ వంతెనపై దాడి జరిగింది. 
 
→ఇది జరిగిన కొన్ని గంటలకే ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో నిరుడు జులైలో కుదిరిన నల్ల సముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు మాస్కో కీలక ప్రకటన చేసింది. 
 
→పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా తమ ఆహార, ఎరువుల ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యలు పరిష్కారమైతేనే తిరిగి నల్లసముద్ర ఆహార ధాన్యాల ఒప్పందంలో చేరుతామని రష్యా ప్రకటించింది. 
 
→ ఉపసంహరణ నిర్ణయాన్ని ఆ దేశ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ప్రకటించగానే షికాగో ట్రేడింగ్‌లో గోధుమల కాంట్రాక్టు 3% పెరిగింది. 
 
→గతేడాది జులైలో కుదిరిన ఈ ధాన్య ఒప్పందం ప్రకారం.. మూడు ఓడరేవుల నుంచి గోధుమలు, మొక్కజొన్న, బార్లీ తదితర ఆహార ఉత్పత్తులను నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్‌ ఎగుమతి చేసుకొనేందుకు రష్యా అంగీకరించింది. 
 
→ఈ నౌకలకు ఆటంకం కలిగించబోమని, వాటిపై దాడులు చేయబోమని హామీ ఇచ్చింది.
 
→ ఇప్పుడు రష్యా తప్పుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా కరవుతో విలవిల్లాడుతున్న కెన్యా, మొరాకో, సోమాలియా, టునీసియా తదితర ఆఫ్రికా దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. 
 



International