image



నాటో అధిపతి స్టోల్టెన్‌బెర్గ్‌ పదవీ కాలం పెంపు




→ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ పదవీ కాలాన్ని పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి. 
 
→ఆయన 2024 అక్టోబరు 1 వరకు ఆ పదవిలో ఉంటారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోల్టెన్‌ బెర్గ్‌ 2014 నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 
 
→గతేడాదే పదవీకాలం ముగిసినా ఉక్రెయిన్‌ యుద్ధంలో దృఢ వైఖరిని అవలంబించినందుకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. 
 
→కొత్త ప్రధాన కార్యదర్శిపై ఏకాభిప్రాయం కుదరనందున స్టోల్టెన్‌ బెర్గ్‌నే మరికొంత కాలం కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. 
 
→ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేవరకు కొత్త ప్రయోగాలు చేయకూడదని నాటో భావిస్తోంది.
 



International