image



నెగెటివ్‌లోకి సునాక్‌ ఆమోద రేటింగ్‌




→గత ఏడాది చివర్లో బ్రిటన్‌ ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 
 
→ఆ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన నెలవారీ సర్వేలో నెగెటివ్‌ ఆమోద రేటింగ్‌ను పొందారు. 
 
→కన్జర్వేటివ్‌ హోం పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. గత నెల సునాక్‌ రేటింగ్‌ 11.7 శాతంగా ఉండగా ఇప్పుడు అది -2.7కు పడిపోయింది. 
 
→ప్రధాని పదవి స్వీకరించిన సమయంలో ఆయన ఆమోద రేటు 49.9 శాతంగా ఉంది. 
 
→శరణార్థులను రువాండాకు పంపే ప్రణాళికకు కోర్టులో ఎదురుదెబ్బ తగలడం, అలాగే వడ్డీ రేట్లను ఐదు శాతం పెంచాలన్న ఇంగ్లండ్‌ బ్యాంక్‌ నిర్ణయం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. 
 
→ అయితే సునాక్‌కు ఊరటనిచ్చే విషయం ఏంటంటే రేటింగ్‌ పరంగా మాజీ ప్రధానులు బోరిస్‌ జాన్సన్, థెరిసా మే కంటే ఆయన మెరుగ్గా ఉన్నారు. 
 
→ఒక దశలో జాన్సన్‌ రేటింగ్‌ -33.8కి తగ్గగా, థెరిసా మే రేటింగ్‌ -51.2కి పడిపోయింది. 
 
→సునాక్‌తో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్‌ సహచరులకూ నెగెటివ్‌ రేటింగే వచ్చింది. 
 
→అయితే రక్షణ శాఖ మంత్రి బెన్‌ వాల్లెస్‌కు అత్యధిక ఆమోద రేటింగ్‌ (77.1 శాతం) లభించింది. 
 
→విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ (54.4), హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ (30.4) రేటింగ్‌ విషయంలో సునాక్‌ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నారు.
 



International