image



అమెరికాలో మరో భారత సంతతి మహిళకు పదవి




→అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా భారత సంతతికి చెందిన గీతారావ్‌ గుప్తాతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
→గీతారావ్‌ నియామకానికి గత మే నెలలోనే సెనెట్‌ ఆమోదం తెలిపింది. 
 
→ఆమె ఇంతకుముందు ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌లలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 
 
→ఆర్థిక వ్యవస్థలో మహిళలు సమాన భాగస్వామ్యం పొందకుండా నిరోధిస్తున్న సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా గీతారావ్‌ గుప్తా తెలిపారు. 
 



International