image



నాటోలోకి స్వీడన్‌




→అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది.
 
→ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. 
 
→ మరోవైపు నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకుంటాంగానీ ఇప్పట్లో కాదని నాటో తేల్చి చెప్పింది. 
 
→ లిథువేనియాలో జరుగుతున్న నాటో దేశాధినేతల రెండ్రోజుల సమావేశంలో తొలి రోజున స్వీడన్‌ చేరికకు ఒప్పందం కుదిరింది. 
 
→ ఇన్నాళ్లూ ఆ దేశ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న టర్కీ, హంగరీలు మనసు మార్చుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. 
 
→ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశానంతరం ఆయా దేశాల అధ్యక్షులు స్వీడన్‌కు పచ్చజెండా ఊపారు. 
 
→ ఎఫ్‌-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో టర్కీకి సభ్యత్వంపై జో బైడెన్‌ నుంచి మద్దతు లభించింది. 
 
→ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో రక్షణ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని కూటమి దేశాలు నిర్ణయానికి వచ్చాయి. 
 
→ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఎదురైన అతి పెద్ద సవాలును ఎదుర్కోవడంతో పాటు రష్యా తమ ప్రాంతంపై దాడి చేస్తే గట్టిగా స్పందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బైడెన్‌తో నాటో కూటమి దేశాధినేతలు చర్చించారు. 
 
→31 సభ్య దేశాలు ఆర్కిటిక్, బాల్టిక్‌ సముద్ర ప్రాంతాలు, ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్, మధ్యధరా, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా ప్రతీకార చర్యకు దిగేలా సిద్ధంగా ఉండాలని వారు తీర్మానించుకున్నారు. 
 
→యూరో అట్లాంటిక్‌ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగింది. రష్యా, తీవ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉంది. 
 
→అందుకే కలిసికట్టుగా సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఏ క్షణంలోనైనా ఎటువంటి ముప్పునైనా తిప్పికొట్టేలా సిద్ధంగా ఉండాలని నిర్ణయించామని నాటో సంయుక్త ప్రకటన వెల్లడించింది. 
 



International