image



గర్భనిరోధక మాత్రల విక్రయం




→అమెరికాలో గర్భనిరోధక మాత్రల విక్రయానికి సంబంధించి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
→మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్‌) అవసరం లేకుండానే ‘ఓపిల్‌’ అనే రకం గర్భనిరోధక మాత్రలను నేరుగా ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించింది.
 
→ ‘ఓపిల్‌’ను పెరిగో అనే ఔషధ కంపెనీ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఆ మాత్రలు మందుల షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. 
 
→ వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలు ఎవరైనాసరే వాటిని కొనుగోలు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. 
 
→అమెరికాలో ప్రిస్క్రిప్షన్‌ అవసరం లేకుండానే ఓ గర్భనిరోధక ఔషధాన్ని విక్రయించేందుకు అనుమతి లభించడం ఇదే తొలిసారి.
 
→ ఆ దేశంలో ఏటా సగటున 60 లక్షల గర్భధారణలు జరుగుతున్నాయని అయితే వాటిలో 45% వరకూ అవాంఛితమైనవేనని అంచనా. 
 
→ గర్భనిరోధక ఔషధాల లభ్యతను పెంచాలంటూ మహిళలు, టీనేజీ బాలికల నుంచి కొన్నాళ్లుగా డిమాండ్లు పెరిగాయి. 
 
→ ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 



International