imageపాక్‌లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులు
→పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. 
 
→అంతేకాకుండా బాధితుల్లో ఎక్కువగా అబ్బాయిలే ఉండటం గమనార్హం. 
 
→ఒక్క పంజాబ్‌ ప్రావిన్సులోనే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో నమోదైన వేధింపుల కేసుల్లో 70 శాతం మంది బాలురే ఉన్నట్లు తెలిపింది. 
 
→చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ హోం మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 
 
→ బాధితుల్లో అత్యధిక శాతం బాలురే ఉన్నట్లు అందులో వెల్లడైంది. పంజాబ్‌ ప్రావిన్సులో ఈ ఏడాది జనవరి - మే మధ్యకాలంలో చిన్నారులపై వేధింపుల (అత్యాచారం)కు సంబంధించి 1,400 ఘటనలు నమోదు కాగా అందులో 965 (70 శాతం) బాలురే ఉన్నారని తెలిపింది. మిగతా 30 శాతం బాలికలు ఉన్నారు.
 International