image



జూన్‌లో రికార్డు ఉష్ణోగ్రత




→గడిచిన 174 సంవత్సరాలలో ఏ జూన్‌ మాసంలోనూ రికార్డు కానంత ఉష్ణోగ్రత ఈ ఏడాది జూన్‌ నెలలో నమోదైందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిశోధన సంస్థ (ఎన్‌ఓఏఏ), నాసా ప్రకటించాయి. 
 
→20వ శతాబ్దిలో భూమిపై సగటు ఉష్ణోగ్రత 15.5 సెల్సియస్‌ డిగ్రీలు కాగా, ఈ జూన్‌లో దానికన్నా 1.05 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
→ఇలా 1 డిగ్రీని మించి ఉష్ణోగ్రత పెరగడం ఇదే తొలిసారి. ఎల్‌నినో వల్లనే ఈ ఏడాది ఉష్ణోగ్రత బాగా పెరిగిందని ఎన్‌ఓఏఏ వివరించింది. 
 
→ఎల్‌నినో పసిఫిక్‌ మహాసముద్ర జలాలను వేడెక్కించి ప్రపంచ వాతావరణాన్ని మారుస్తుంది. 
 
→వాతావరణ రికార్డుల నిర్వహణ మొదలైనప్పటి నుంచి ఇంతవరకు అత్యుష్ణ సంవత్సరాలుగా నమోదైన 10 సంవత్సరాలలో 2023 ఒకటవుతుందని తెలిపింది.
 



International