image



జావాలో 7 దేశాల సైనిక విన్యాసాలు




ఇండోనేసియా ప్రధాన దీవి అయిన జావాలో అమెరికా సహా ఏడు దేశాల సైనికుల వార్షిక విన్యాసాలు మొదలయ్యాయి. 
 
అమెరికా, ఇండోనేసియా దేశాలు 2009 నుంచి నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో గతేడాది ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్‌ జత కలిశాయి. 
 
తూర్పు జావా ప్రావిన్సులోని తీరప్రాంత పట్టణం బలూరన్‌లో రెండు వారాల పాటు జరగనున్న ఈ విన్యాసాలకు భారత్‌ సహా మరో 12 దేశాలు తమ పరిశీలకులను పంపాయి. 
 
అమెరికా సైన్యానికి చెందిన కమాండింగ్‌ జనరల్‌ ఛార్లెస్‌ ఫ్లిన్‌ మాట్లాడుతూ.. మొత్తం 19 దేశాల భాగస్వామ్యం ఉన్న ఈ శిక్షణ విన్యాసాలు ఇండో - పసిఫిక్‌ ప్రాంత రక్షణకు బహుపాక్షిక సంఘీభావ ప్రదర్శనగా పేర్కొన్నారు.
 



International