imageబ్రిటన్‌ కేబినెట్‌లోకి భారత సంతతి మహిళ
→ బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. 
 
→ గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినోను ఇంధన శాఖ మంత్రిగా ప్రధాని రిషి సునాక్‌ నియమించారు. 
 
→ ప్రస్తుతం ఇంధన శాఖ మంత్రిగా ఉన్న గ్రాంట్‌ షాప్స్‌ రక్షణ మంత్రిగా పదోన్నతి పొందారు. 
 
→ సునాక్‌లాగే బ్రిటన్‌లో జన్మించిన కౌటినో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్‌ చేశారు. 
 
→ ఈస్ట్‌ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సునాక్‌ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా నియమితురాలయ్యారు. 
 
→ గతంలో బ్రిటన్‌ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా, సునాక్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా, ఖజానాకు ఛాన్సలర్‌గా కౌటినో పని చేశారు. 
 International