imageగబోన్‌లో సైన్యం తిరుగుబాటు
ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు అలీ బాంగో (64)ను గబోన్‌లో సైనికులు గృహ నిర్బంధంలోకి తీసుకొని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 
 
దేశ సరిహద్దులను మూసివేశారు. కొత్త పాలకుడిగా జనరల్‌ బ్రైస్‌ క్లొటైర్‌ ఒలిగు గుయేమాను ఎన్నుకున్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అలీ బాంగో 64 శాతం ఓట్లతో నెగ్గారు. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని తిరుగుబాటు చేసిన సైన్యం ఆరోపించింది. 
 
అలీ బాంగో కుటుంబం 55 ఏళ్లుగా గబోన్‌ను పాలిస్తోంది. అలీ తండ్రి ఉమర్‌ బాంగో 1967 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 
 
అధికారం చేజిక్కించుకున్నామని సైనికులు జాతీయ టెలివిజన్‌లో ప్రకటించగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి తిరుగుబాటుకు సంఘీభావం తెలిపారు.
 International