image



కుల వివక్షకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా బిల్లు




→ కుల వివక్షను వ్యతిరేకిస్తూ బలహీన వర్గాలకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఆమోదించింది. 
అది గవర్నర్‌ గేవిన్‌ న్యూసమ్‌ ఆమోదం పొందాక చట్టమవుతుంది. 
 
→ కాలిఫోర్నియా పౌర హక్కుల చట్టాన్నీ, విద్యా, గృహ వసతి నిబంధనలనూ ఈ బిల్లు సవరిస్తోంది. 
 
→ సెనెటర్‌ ఆయిషా వహాబ్‌ ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టిన ఎస్‌.బి 403 బిల్లును అమెరికా అంతటా కుల పరమైన సమానత్వం కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతున్న బృందాలన్నీ సమర్థించాయి. 
 
→ మరోవైపు తటస్థత లోపించిన ఈ బిల్లు హిందూ అమెరికన్లను వేధించడానికి ఉద్దేశించినదని, ఇది కాలిఫోర్నియా చరిత్రలో చీకటి అధ్యాయమని ఉత్తర అమెరికా హిందువుల సంకీర్ణం (కోహ్నా) విమర్శించింది.
 
→ ఒక విద్వేష బృందం అందించిన లోపభూయిష్ట సమాచారం ఆధారంగా రూపొందిన బిల్లును విదేశీ శక్తులు బలపరిచాయని ఆరోపించింది.
 



International