image



కంబోడియా ప్రధానమంత్రిగా హన్‌ మనెట్‌




దీర్ఘకాలంగా పాలిస్తున్న నియంత నేత హన్‌సెన్‌ తనయుడు హన్‌ మనెట్‌ (45)ను ప్రధానమంత్రిగా కంబోడియా పార్లమెంటు ఆమోదించింది. 
 
కంబోడియా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జులైలో మనెట్‌ ఎన్నికయ్యారు. 
 
సైన్యాధిపతిగా సేవలందించిన తర్వాత కంబోడియా పాలన పగ్గాలు దక్కించుకున్న హన్‌సెన్‌ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. 
 
ఆసియాలోనే అత్యంత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న దేశాధినేతగా గుర్తింపు పొందారు. 
 
మానవ హక్కుల్ని కాలరాస్తున్నారనే అభియోగాలను కంబోడియా ఎదుర్కొంటున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. 
 
నూతన కేబినెట్‌లోనూ నేతల వారసులకే సముచిత స్థానం లభించింది.
 



International