image



థాయ్‌లాండ్‌ ప్రధానిగా థావిసిన్‌ ఎన్నిక




థాయ్‌లాండ్‌ ప్రధానిగా ఆ దేశ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం శ్రెథ్థా థావిసిన్‌ ఎన్నికయ్యారు. 
 
పార్లమెంటులో తాజాగా నిర్వహించిన ఓటింగ్‌లో మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రకు చెందిన ఫ్యూథాయ్‌ పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. 
 
మొత్తం 727 ఓట్లలో థాయ్‌ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధానిగా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం థావిసిన్‌ను ఎన్నుకున్నారు. 
 
రెండు మిలిటరీ అనుకూల పార్టీలతో పాటు మొత్తం 11 పార్టీల సంకీర్ణ కూటమికి థావిసిన్‌ నేతృత్వం వహించనున్నారు.
 



International