image



చైనా లేజర్‌ పరిజ్ఞానంలో సరికొత్త సాంకేతికత




 
→లేజర్‌ పరిజ్ఞానంలో సరికొత్త సాంకేతికతను చైనా అభివృద్ధి చేసింది. 
 
→లేజర్‌ అయుధాలు వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త కూలింగ్‌ వ్యవస్థను కనుగొంది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
 
→ కానీ ఆ దేశ శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు’ ఒక కథనం ప్రచురించింది. 
 
→కొత్త కూలింగ్‌ వ్యవస్థతో ఇక లేజర్‌ ఆయుధాలు నిరవధికంగా కాల్పులు జరిపే సామర్థ్యం సొంతం చేసుకోనున్నాయి. 
 
→రోదసిలో తిరిగే ఉపగ్రహాలనూ వీటితో కూల్చొచ్చు. ఈ లేజర్‌ నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణిస్తుందని, ఇది భవిష్యత్తు యుద్ధరంగ తీరుతెన్నులను
పూర్తిగా మార్చేస్తుందని ఆ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
→చైనాలోని చెంగ్డూలోని ‘నేషనల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. 
 
→ఈ కూలింగ్‌ సిస్టమ్‌ హైఎనర్జీ లేజర్‌కు వేడెక్కకుండానే శక్తిని అందిస్తుందని పేర్కొంది. 
 
→ఇది ఓ విప్లవాత్మక పరిణామమని నేషనల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త యువాన్‌ షెంగ్ఫూ పేర్కొన్నారు. 
 
→ఈ మేరకు ఆయన ఆగస్టు 4న ‘ఆక్టా ఆప్టిక్‌ సినికా’ అనే చైనా జర్నల్‌లో ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. 
 
→వాస్తవానికి లేజర్‌ ఆయుధాలు వినియోగించే సమయంలో పుట్టుకొచ్చే ఉష్ణం పెద్ద సమస్య. 
 
→ఇది పలు సాంకేతిక సమస్యలకు కూడా కారణమవుతోంది. ఇప్పటికే అమెరికా హైగ్రేడ్‌ లేజర్‌ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. 
 
→వీటిల్లో నేవీ అడ్వాన్స్‌డ్‌ కెమికల్‌ లేజర్, మిడిల్‌ ఇన్ఫార్రెడ్‌ అడ్వాన్స్‌డ్‌ కెమికల్‌ లేజర్, టాక్టికల్‌ హైఎనర్జీ లేజర్, స్పేస్‌ బేస్డ్‌ లేజర్‌ వంటివి ఉన్నాయి. 
 
→వీటిల్లో కొన్నింటిని క్షేత్ర స్థాయిలో అగ్రరాజ్యం పరీక్షించింది. 
 
→వీటిని హైపర్‌సానిక్‌ క్షిపణులను ధ్వంసం చేయాడానికి కూడా వినియోగించాలనే ఆలోచనలో ఉంది. 
 
→కానీ, ఈ లేజర్ల పరిధి కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ, తాజాగా చైనా కనుగొన్న టెక్నాలజీ లేజర్‌ విధ్వంసక శక్తిని మరింత పెంచనుంది.
 
 



International