image



ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్‌ ప్రమాణం




→పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా పష్తూన్‌ తెగకు చెందిన నేత అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌తో అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి ప్రమాణస్వీకారం చేయించారు. 
 
→అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 
 
→పాక్‌కు అన్వరుల్‌ 8వ ఆపద్ధర్మ ప్రధాని కావడం విశేషం. 
 
→వచ్చే కొద్ది సంవత్సరాల్లో పాకిస్థాన్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆదేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి ధీమా వ్యక్తం చేశారు. 
 
→దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో పాటు, నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళ రాజకీయ నేతలంతా తమ మధ్య విభేదాలు, విరోధాలకు దూరంగా ఉండి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే అందరూ క్షమాగుణం మార్గాన్ని అనుసరించాలన్నారు. 
 
→ఇస్లామాబాద్‌లోని ఓ సమావేశ కేంద్రంలో జరిగిన దేశ 77వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. తమ దేశానికి ఆర్థిక మద్దతిస్తున్న మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, తుర్కియేలకు అరిఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు.
 



International